అపెక్స్ బ్యాంక్ కేసులో నైజీరియన్ అరెస్ట్

అపెక్స్ బ్యాంక్ కేసులో నైజీరియన్ అరెస్ట్
  • టోలిచౌకిలో లేవి డైలాన్ రోవాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్:  అపెక్స్ బ్యాంకులో నగదు మాయం కేసులో మరో నిందితున్ని సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నగరంలోని టోలిచౌకి పరిధిలో నివాసముంటున్న నైజీరియన్ లేవి డైలాన్ రోవాన్ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి.. రూ.1.96 కోట్లు కాజేసిన నిందితుడిగా గుర్తించారు. ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన నిందితులు కమీషన్‌ తీసుకుని నైజీరియన్ కి ఖాతాల వివరాలు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. బ్యాంక్ మూలధన ఖాతా నుంచి రూ.1.96 కోట్లు సర్వర్‌లోకి వెళ్లి వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. అకౌంట్స్ ట్రాన్సక్షన్స్ మొబైల్ సిగ్నల్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు నైజీరియన్ ఆచూకీ కనుగొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.